శాన్‌జోస్ (అమెరికా), జూలై 19: వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్.. క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్ ప్రొవైడర్ ఫైవ్9ను హస్తగతం చేసుకుంటున్నది. పూర్తిగా స్టాక్ లావాదేవీల్లో జరిగే ఈ డీల్ విలువ దాదాపు 14.7 బిలియన్ డాలర్లు (రూ. 1,10,074 కోట్లు).
ఇక ఈ డీల్‌లో భాగంగా ఫైవ్9 వాటాదారులు తమ ఒక్కో షేర్‌కు 0.5533 జూమ్ ఏ క్లాస్ కామన్ స్టాక్‌ను పొందనున్నారు. వచ్చే ఏడాది జూన్ ఆఖరుకల్లా ఈ లావాదేవీ ముగుస్తుందన్న అంచనాలున్నాయి. అయితే ఇంకా ఈ డీల్‌కు ఫైవ్9 వాటాదారుల ఆమోదం
లభించాల్సి ఉన్నది.