శనివారం 06 జూన్ 2020
Business - May 15, 2020 , 18:14:22

600 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో!

600 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో!

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభానికి ప్రభావితమైన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ   జొమాటో  కీలక నిర్ణయం తీసుకున్నది. సంస్థలో పనిచేస్తున్న  600 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది.  తమ ఉద్యోగుల్లో 13 శాతం  మందిని  తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగిస్తుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోకపోవడంతో కంపెనీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మిగతా ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించారు. ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులకు సంస్థ ఆర్థిక సహాయం చేస్తుందని కొత్తగా ఉద్యోగాలు పొందడానికి కూడా జొమాటో సాయం చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

జూన్‌ నెల జీతంలో సుమారు 50శాతానికి పైగా కోతపెట్టనున్నారు. తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు పరిహారం ఇవ్వనున్నారు.  ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఉద్యోగులకు ఓ కూడా నోట్ పంపారు.  కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల  వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిందని, తప్పని పరిస్థితుల్లో కిరాణా సరుకులు డెలివరీ చేయాల్సి వస్తోందన్నారు.   జూన్ 1 నుంచి సంస్థలోని ఉద్యోగులందరి వేతనాల్లో తాత్కాలికంగా కోతలు ఉంటాయని  గోయల్  స్పష్టం చేశారు. 


logo