శుక్రవారం 05 జూన్ 2020
Business - May 16, 2020 , 02:40:37

13% ఉద్యోగులనుతొలగిస్తున్న జొమాటో

13% ఉద్యోగులనుతొలగిస్తున్న జొమాటో

న్యూఢిల్లీ, మే 15: ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్‌ సంస్థ జొమాటో.. దాదాపు 13 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. కరోనా వైరస్‌ ప్రభా వం నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు జొమాటో వ్యవస్థాపక సీఈవో దీపీందర్‌ గోయల్‌ స్పష్టం చేశారు. సంస్థలో ప్రస్తుతం వివిధ విభాగాల్లో సుమారు 4 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 500 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. గత రెండు నెలలుగా సంస్థ వ్యాపారం చాలా దెబ్బతిన్నదని, అందుకే కొందరు ఉద్యోగులను తీసేస్తున్నామని చెప్పారు. మిగతా ఉద్యోగులకూ జీతాల్లో కోతలుంటాయన్నారు. 


logo