శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 03:05:06

కార్‌ లోన్‌ కావాలా?

కార్‌ లోన్‌ కావాలా?

మీ బ్యాంక్‌తో మీకున్న సంబంధాలు, మీ చెల్లింపుల చరిత్ర ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్‌ కార్‌ లోన్లను పొందవచ్చు. డాక్యుమెంట్లతోనూ పెద్దగా పనిలేదు. ఒకవేళ మీకు నగదు కొరత ఉన్నా.. కొన్ని బ్యాంకర్లు, రుణదాతలు మీ కారు విలువలో 150 శాతం వరకు రుణాలిచ్చేందుకూ సిద్ధంగా ఉంటున్నారు. లేకపోతే 50 శాతం వరకు రుణ సాయమే లభిస్తుంది. ఇక మీరు బ్యాంక్‌కు కొత్త కస్టమరైతే కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ వివరాలు, వేతన ప్రతులు (సాలరీ స్లిప్పులు) లేదా ఐటీఆర్‌లు మొదలగునవి అవసరం. అయితే వేతన జీవులు, స్వయం ఉపాధిగలవారికి ఈ డాక్యుమెంట్లలో తేడాలుంటాయని బ్యాంక్‌బజార్‌.కామ్‌ సీఈవో అదిల్‌ శెట్టి చెప్తున్నారు. ఇక ఓ ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ 13.75-17 శాతం శ్రేణి వార్షిక వడ్డీరేటుతో కార్ల రుణాలను ఇస్తున్నది. మరో ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ వార్షిక వడ్డీరేటు 14.8-16.8 శాతంగా ఉన్నది. రుణ కాలపరిమితి ఏడాది నుంచి 84 నెలల వరకు ఉంటుంది. వివిధ చార్జీలూ వర్తిస్తాయి.


logo