మంగళవారం 04 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 02:12:18

యెస్‌ బ్యాంక్‌ స్వాధీనంలో అడాగ్‌ ప్రధాన కేంద్రం

యెస్‌ బ్యాంక్‌ స్వాధీనంలో అడాగ్‌ ప్రధాన కేంద్రం

  • తీసుకున్న అప్పుల్ని చెల్లించని అనిల్‌ అంబానీ

ముంబై, జూలై 30: ముంబైలోని అనిల్‌ అంబానీ గ్రూప్‌ ప్రధాన కేంద్రాన్ని యెస్‌ బ్యాంక్‌ స్వాధీనపర్చుకున్నది. తీసుకున్న రుణాలను చెల్లించడంలో అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ (అడాగ్‌) విఫలం కావడంతో ఇక్కడి సబర్బన్‌ శాంటాక్రజ్‌లోని హెడ్‌క్వార్టర్‌ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు బుధవారం యెస్‌ బ్యాంక్‌ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. యెస్‌బ్యాంక్‌కు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.2,892.44 కోట్లు బకాయిపడింది. కాగా, దక్షిణ ముంబైలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్లనూ యెస్‌ బ్యాంక్‌ హస్తగతం చేసుకున్నది. 


logo