ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 06, 2020 , 13:07:50

యెస్ బ్యాంకు షేర్లు 85% డౌన్‌ .. హామీ ఇచ్చిన ఆర్బీఐ

యెస్ బ్యాంకు షేర్లు 85% డౌన్‌ ..  హామీ ఇచ్చిన ఆర్బీఐ

హైద‌రాబాద్‌:  ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. యెస్ బ్యాంకుకు మ‌ళ్లీ జీవం పోసేందుకు 30 రోజుల గ‌డువు ఇచ్చామ‌ని, కానీ అంత క‌న్నా ముందే ఈ ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌న్నారు.  బ్యాంకుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటే, ఆ బ్యాంకుల‌కు కొంత స‌మ‌యం ఇవ్వాల‌న్నారు. యెస్ బ్యాంకు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని తెలిసిన త‌ర్వాత‌నే ఆర్బీఐ జోక్యం చేసుకున్న‌ద‌న్నారు. మ‌రోవైపు ఇవాళ యెస్ బ్యాంకు షేర్లు 85 శాతం ప‌డిపోయాయి. యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించ‌డం వ‌ల్ల ఆ బ్యాంకు ట్రేడింగ్‌లో బోరుమ‌న్న‌ది.  కేవ‌లం 50 వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకోవాల‌ని ఆర్బీఐ ఆంక్ష‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ‌ల్ల భార‌త మార్కెట్ల‌పైన కూడా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.  గ‌తంతో పోలిస్తే, గ‌త 20 ఏళ్ల నుంచి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో భార‌త్ అనుసంధాన‌మై ఉంద‌న్నారు. అయితే మిగితా దేశాల త‌ర‌హాలో పూర్తిగా అంత‌ర్జాతీయ మార్కెట్‌పై ఆధార‌ప‌డి లేమ‌ని, అందుకే మ‌న‌కు పెద్ద‌గా న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌న్నారు. యెస్ బ్యాంకు ఫండ్స్ అన్ని క్షేమంగా ఉన్నాయ‌ని యెస్ బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు చీఫ్ ఎక‌నామిక్ అడ్వైజ‌ర్ కృష్ణ‌మూర్తి సుబ్ర‌మ‌ణియ‌న్ హామీ ఇచ్చారు. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.logo