శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Dec 29, 2020 , 23:15:52

పుత్తడిపై మంచి లాభాలు.. 2011 తర్వాత ఇదే బెస్ట్‌

పుత్తడిపై మంచి లాభాలు.. 2011 తర్వాత ఇదే బెస్ట్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో తలెత్తిన అనిశ్చితి పసిడిపై పెట్టుబడులకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్నదన్న సంకేతాల మధ్య షేర్‌ మార్కెట్లలో రికవరీ సాధించడంతో పుత్తడి ధర తగ్గుముఖం పట్టింది. 2011 నుంచి 2020లో బంగారం ఇన్వెస్టర్లకు 26 శాతానికి పైగా రిటర్న్స్‌ వచ్చాయి.

ఇంతకుముందు 2011లో పసిడిపై పెట్టుబడిదారులకు 38 శాతం లాభాలు గడించి పెట్టాయి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో షేర్‌ మార్కెట్లలో కంటే పసిడిపై పెట్టుబడులే ఫ్రాఫిట్లు తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే. సమీప భవిష్యత్‌లో పుత్తడి ధరలు మరింత దూసుకెళ్తాయని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కరోనా వైరస్‌ ప్రభావం మొదలయ్యే వరకు పది గ్రాముల పుత్తడి ధర రూ.39,600 స్థాయికి చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువ. అయితే దేశీయంగా కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతున్న వేళ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి నేపథ్యంలో ఏప్రిల్‌లో అసాధారణ రీతిలో పది గ్రామలు బంగారం ధర రూ.46,000లకు, మే, జూన్‌ నెలల్లో రూ.47,000లకు, జూలైలో రూ.49వేలకు దూసుకు వెళ్లింది.

స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లకు గోల్డ్‌ సురక్షిత పెట్టుబడి మార్గంగా నిలిచింది. ఫలితంగా ఆగస్టు నెలలో పసిడి ధరలు మరింత దూసుకెళ్లి ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాయి. ఆగస్టులో రూ.57 వేలకు దూసుకెళ్లిన గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర.. తర్వాత కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వస్తుందన్న అంచనాల మధ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. నవంబర్‌ నెలలో రూ.50 వేలకు చేరిన పది గ్రాముల బంగారం ధర.. క్రమంగా క్షీణించింది. 


గత కొన్నేళ్లుగా పసిడిపై పెట్టుబడులతో లాభాలు

ఏడాది- ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌- వార్షిక లాభం(శాతం)

2020 (డిసెంబర్‌ 15వరకు)-రూ. 50,679.5-32.43%

2019-రూ.38,269-20.71%

2018-రూ.31,702-7.11%

2017-రూ. 29,598- -1.61%

2016-రూ. 30,082- 17.11%

2015-రూ. 25,686- -6.53%

2014-రూ.27,481- -7.86%

2013-రూ.29,826- -6.14%

2012-రూ.31,778- 16.15%

2011-రూ.27,359- 37.52%

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo