గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Feb 09, 2021 , 01:55:30

మార్కెట్లోకి ఎఫ్‌జడ్‌ నయా సిరీస్‌

మార్కెట్లోకి ఎఫ్‌జడ్‌ నయా సిరీస్‌

  • ప్రారంభ ధర రూ.1.03 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా..దేశీయ మార్కెట్లోకి ఎఫ్‌జడ్‌ సిరీస్‌ నూతన మోటార్‌సైకిళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈబైకుల  ప్రారంభ ధర రూ. 1,03,700 గా నిర్ణయించింది.  ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఎఫ్‌ఎఫ్‌జడ్‌ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన రెండు రకాల బైకులు 149 సీసీ సామర్థ్యం, బీఎస్‌-6 ఇంజిన్‌, సై డ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ ఉన్నాయి. వీటిలో ఎఫ్‌జడ్‌ ఎఫ్‌ఐ ప్రారంభ ధర రూ.1,03,700 గాను, నూతన ఎఫ్‌జడ్‌ఎస్‌ ఎఫ్‌ఐ ప్రారంభ ధర రూ.1,07,200గా నిర్ణయించింది. యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, బ్లూటూత్‌తో కనెక్ట్‌ ద్వారా ఈ-లాక్‌, బైకు ఉన్న స్థలం వంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చును. 


VIDEOS

logo