ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 28, 2020 , 17:23:08

అప్పుడు యాపిల్‌ను వెక్కిరించి ఇప్పుడు షియోమీ అదేప‌ని చేసిందిగా..!

అప్పుడు యాపిల్‌ను వెక్కిరించి ఇప్పుడు షియోమీ అదేప‌ని చేసిందిగా..!

హైద‌రాబాద్‌: యాపిల్ కంపెనీ గ‌త అక్టోబ‌ర్‌లో త‌న కొత్త ప్రోడ‌క్ట్ అయిన‌ ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అయితే చార్జ‌ర్ లేకుండానే ఆ ఫోన్‌ల‌ను అమ్మ‌కానికి పెట్టింది. దాంతో చైనా మొబైల్ త‌యారీ కంపెనీ అయిన షియోమీ అప్ప‌ట్లో యాపిల్‌పై విమ‌ర్శ‌లు చేసింది. చార్జ‌ర్‌లు లేకుండా కొత్త ఫోన్‌ల‌ను విక్ర‌యానికి పెట్ట‌డంపై ఎగ‌తాళి చేసింది. ఇది జ‌రిగి కొద్ది వారాలైనా గ‌డువ‌క ముందే ఇప్పుడు షియోమీ కూడా అదే ప‌నిచేసింది. ఇవాళ కొత్తగా రిలీజ్ అయిన షియోమీ ఎంఐ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ల‌ను చార్జ‌ర్ లేకుండానే లాంచ్ చేసింది. 

కంపెనీ కొత్త ఉత్ప‌త్తి అయిన ఎంఐ 11 5జీ ఫోన్ ప్యాకింగ్స్‌లో చార్జ‌ర్‌లు ఉండ‌వ‌ని షియోమీ కంపెనీ సీఈవో లీ జున్ ప్ర‌క‌టించారు. గ‌త అక్టోబ‌ర్‌లో వితౌట్ చార్జ‌ర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన యాపిల్ కంపెనీని వెక్కిరిస్తూ షియోమీ కంపెనీ ట్విట్ట‌ర్‌లో కామెంట్లు చేసింది. తాము విడుద‌ల చేసిన ఎంఐ 10T ప్రో నుంచి ఏ వ‌స్తువును తొల‌గించ‌లేద‌ని వ్యాఖ్యానించింది. ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కానీ సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు మాత్రం ఈ ప‌రిణామం అసంతృప్తి క‌లిగించింది. అప్పుడు యాపిల్‌ను వెక్కించి ఇప్పుడు మీరు చేసింది ఏమిటంటూ షియోమీ సంస్థ‌ను ట్రోల్ చేస్తున్నారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo