న్యూఢిల్లీ, జూలై 16: చైనా స్మార్ట్ఫోన్ల కంపెనీ షియామి ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ ఏప్రిల్-జూన్‌లో ఫోన్ల అమ్మకాల్లో యాపిల్‌ను షియామి అధిగమించిందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాన్లేస్ తెలిపింది. 17 శాతంతో షియామి ఉండగా, 14 శాతం వాటాతో యాపిల్ మూడో స్థానానికి తగ్గింది. 19 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.