మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jun 27, 2020 , 00:09:56

షియామీ స్టోర్లకు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బ్యానర్లు

షియామీ స్టోర్లకు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బ్యానర్లు

భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ దేశంలోని చైనా కంపెనీలు అప్రమత్తమయ్యా యి. ఇందులో భాగంగానే దేశీయ మొబైల్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న షియామీ.. తమ స్టోర్ల ముందు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బ్యానర్లను పెడుతున్నది. చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో చైనా సంస్థలపై దాడులు జరిగే వీలుందని అఖిల భారత మొబైల్‌ రిటైలర్స్‌ సంఘం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు లేఖలు రాయగా, ఈ క్రమంలోనే సంఘం సూచనల ప్రకారం తమ స్టోర్ల ముందు మేడ్‌ ఇన్‌ ఇండియా బ్యానర్లను ఎంఐ పెడుతున్నది. మిగతా సంస్థలు సైతం పరిస్థితులను సమీక్షిస్తున్నాయని సదరు సంఘం తెలియజేసింది. చైనాకు చెందిన షియామీ, వివో, ఒప్పో, రియల్‌మీ మొబైల్స్‌ భారతీయ మార్కెట్‌ను శాసిస్తుండగా, ఒకప్పుడు మార్కెట్‌ లీడర్‌గా ఉన్న సామ్‌సంగ్‌కు తాజా పరిణామాలు లాభించవచ్చన్న అంచనాలున్నాయి. 


logo