మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 24, 2020 , 00:56:23

శంకర్‌పల్లిలో యూడబ్ల్యూఐసీ యూనిట్‌

శంకర్‌పల్లిలో యూడబ్ల్యూఐసీ యూనిట్‌

హైదరాబాద్‌, జనవరి 23: అల్యుమినియం కిటికీలు, తలుపుల తయారీ సంస్థ యూడబ్ల్యూఐసీ..రాష్ట్రంలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఇదివరకే హైదరాబాద్‌లోని బొల్లారం వద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా శంకర్‌పల్లి వద్ద రూ.3-4 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు కంపెనీ ఎండీ తరుణ్‌ సందీప్‌ తెలిపారు. జపాన్‌కు చెందిన వైకేకేఏపీతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ..వినియోగదారులకు నూతన టెక్నాలజీ ద్వారా తయారుకానున్న కిటికీలు, తలుపులను అందించడానికి వైకేకేతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆటోమేటిక్‌ డోర్లు, కిటికీలు వైకేకే తయారు చేయనున్నదని చెప్పారు. ప్రస్తుతం సంస్థ ఏడాదికి 3 లక్షల చదరపు అడుగుల కెపాసిటీ కలిగివుండగా, నూతన ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే ఈ సామర్థ్యం 10 లక్షల చదరపు అడుగులకు చేరుకోనున్నదన్నారు. సంస్థ వద్ద రూ.50-60 కోట్ల స్థాయిలో ఆర్డర్లు ఉండగా, వచ్చే ఏడాదిన్నర లోగా వీటిని అందించనున్నది.


logo
>>>>>>