e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News పీపీఎఫ్‌లో పొదుపుతో ఐదు బెనిఫిట్లు!

పీపీఎఫ్‌లో పొదుపుతో ఐదు బెనిఫిట్లు!

పీపీఎఫ్‌లో పొదుపుతో ఐదు బెనిఫిట్లు!

న్యూఢిల్లీ: మీరు డ‌బ్బు పొదుపు చేయాల‌నుకుంటున్నారా.. అయితే, ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌) ఎంతో మంచి స్కీమ్‌. ఇత‌ర పొదుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే పీపీఎఫ్‌లో మ‌దుపు చేసిన సొమ్ముపై మంచి వ‌డ్డీరేటుతోపాటు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అంతే కాదు.. ఇది పూర్తిగా మీ సొమ్ముకు సుర‌క్షిత‌మైంది కూడా..

అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు పీపీఎఫ్ ఖాతా నుంచి రుణం తీసుకునే ఫెసిలిటీ కూడా క‌ల్పిస్తున్న‌ది. పీపీఎఫ్‌లో ఐదు ప్ర‌త్యేకత‌లున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ప్ర‌భుత్వ హామీయే భ‌ద్ర‌త‌

కేంద్ర ప్ర‌భుత్వం నేరుగా నియంత్రించే మ‌దుపు ప‌థ‌కాల్లో ఒక‌టి పీపీఎఫ్‌. దీనిపై ఎంత వ‌డ్డీరేటు ఇవ్వాల‌న్న‌దీ కేంద్ర‌మే నిర్ణ‌యిస్తుంది. త‌ద్వారా ఈ ప‌థ‌కంలో మ‌దుపు చేసిన సొమ్ముపై కేంద్ర ప్ర‌భుత్వ హామీయే భ‌ద్ర‌త‌గా ఉంటుంది.

ప‌న్ను మిన‌హాయింపుకు పీపీఎఫ్‌

మీరు గుడ్ రిటర్న్స్‌తోపాటు ప‌న్ను మిన‌హాయింపు కోసం వేచి చూస్తున్నారా.. అటువంట‌ప్పుడు పీపీఎఫ్‌లో మ‌దుపు చేయ‌డం ఉత్త‌మం. పీపీఎఫ్‌లో కంటే సుక‌న్య స‌మ్రుద్ధి యోజ‌న‌, సీనియ‌ర్ సిటిజ‌న్ స్కీమ్ ప‌థ‌కాల్లో మాత్రం అధిక రిట‌ర్న్స్ వ‌స్తాయి. కానీ వాటిల్లో ప్ర‌తి ఒక్క‌రూ మ‌దుపు చేయ‌డం లేదు.

తేలిగ్గానే ఈ ప‌థ‌కంలో మ‌దుపు చేయొచ్చు

పీపీఎఫ్ ప‌థ‌కంలో సొమ్ము మ‌దుపు చేయ‌డం చాలా తేలిక‌. ఏడాదికి క‌నీసం రూ.500 మ‌దుపు చేయాలి. గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. అయితే, ఎప్పుడైనా డ‌బ్బు అందుబాటులో లేకున్నా స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌రిష్ఠంగా 12 వాయిదాల్లో న‌గ‌దు డిపాజిట్ చేయొచ్చు.

పీపీఎఫ్‌లో పొదుపుతో ఐదు బెనిఫిట్లు!

ఇలా రుణ ఫెసిలిటీ..

పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేసిన మొత్తంపై రుణం కూడా తీసుకోవ‌చ్చు. అయితే, పీపీఎఫ్‌లో సొమ్ము జ‌త చేశాక ఏడాది గ‌డిచాక ఐదేండ్ల వ‌ర‌కు రుణ ప‌ర‌ప‌తి సౌక‌ర్యం ఉంటుంది.

25 % డిపాజిట్‌పై రుణం తీసుకోవ‌చ్చు

ఉదాహ‌ర‌ణ‌కు 2017 జ‌న‌వ‌రిలో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించార‌నుకుందాం.. 2018 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2022 మార్చి 31 వ‌ర‌కు రుణం తీసుకోవ‌చ్చు. మొత్తం డిపాజిట్‌లో 25 శాతం వ‌ర‌కు రుణం తీసుకోవ‌చ్చు. పీపీఎఫ్‌పై వ‌చ్చే వ‌డ్డీరేటు కంటే ఒక‌శాతం ఎక్కువ వ‌డ్డీ వ‌సూలు చేస్తారు. రెండు నెల‌ల‌కోసారి గానీ, భారీ మొత్తంలో గానీ రుణం చెల్లించొచ్చు.

కాంపౌండింగ్ వ‌డ్డీతో బెనిఫిట్లు ఇలా

పీపీఎఫ్‌లో మ‌దుపు ప్ర‌యోజ‌న‌క‌రంగా మారుతుంది. త్రైమాసికానికి ఒక‌సారి వ‌డ్డీరేటు మారుతుంది. ఒక త్రైమాసికంలో త‌క్కువ వ‌డ్డీ పొందితే, త‌దుప‌రి త్రైమాసికంలో ఎక్కువ వ‌డ్డీరేటు పొందొచ్చు. దీంతోపాటు కాంపౌండింగ్ వ‌డ్డీరేటు కూడా అందుబాటులో ఉంది.

15 ఏండ్ల‌కు మెచ్యూరిటీ

పీపీఎఫ్ ఖాతాలో జ‌మ చేసిన సొమ్ము 15 ఏండ్ల త‌ర్వాత మెచ్యూర్ అవుతుంది. కానీ మీకు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు కూడా తీసుకోవ‌చ్చు. మెచ్యూరిటీ గ‌డువు ముగిసిన త‌ర్వాత మీకు డబ్బు అవ‌స‌రం లేక‌ప‌తే దాన్ని కొన‌సాగించవ‌చ్చు.. త‌త్ఫ‌లితంగా భారీ మొత్తంలో నిధులు పొందొచ్చు.

ఇవి కూడా చ‌దవండి:

ఇంటి పెద్ద‌ను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?

ముకేశ్ అంబానీ గ‌తేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?

ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయ‌ల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథ‌నాల్ పెట్రోల్‌

టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…

2.27 కోట్లు.. ఏప్రిల్‌, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు

లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్‌

రికార్డు గ‌రిష్టానికి స్టాక్ మార్కెట్‌లు

ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో

ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్ర‌ధానమంత్రిగా బెన్నెట్

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా

Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్​ ఇదే..!

మ‌హేష్ ముంద‌డుగు.. అభిమానుల‌లో ఉత్సాహం

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పీపీఎఫ్‌లో పొదుపుతో ఐదు బెనిఫిట్లు!

ట్రెండింగ్‌

Advertisement