బుధవారం 03 మార్చి 2021
Business - Dec 29, 2020 , 00:13:18

దక్షిణాదిలో పెరిగిన ఆఫీస్‌ స్పేస్‌ యూసేజ్‌

దక్షిణాదిలో పెరిగిన ఆఫీస్‌ స్పేస్‌ యూసేజ్‌

న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే కరోనా వల్ల లాక్‌ డౌన్‌ సమయంలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ తగ్గుముఖం పట్టిందని ఓ అధ్యయనంలో తేలింది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా కార్పొరేట్‌ సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రం హోం’ ఫెసిలిటీ కల్పించాయి. దీంతో గతేడాదితో పోలిస్తే నికరంగా ఆఫీస్‌ స్పేస్ డిమాండ్‌ 44 శాతం తగ్గిపోయి 25.82 మిలియన్‌ చదరపు అడుగులకు పడిపోయిందని జేఎల్‌ఎల్‌ ఇండియా సంస్థ అధ్యయనంలో తేలింది.

దేశ రాజధాని ఢిల్లీ- ఎన్సీఆర్‌, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో 2019లో ఆఫీస్‌ స్పేస్‌ కోసం 46.5 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజ్‌ ఒప్పందాలు కుదిరాయి. కరోనా వల్ల దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలను వాయిదా వేశాయి. 

అయితే కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుతల వారీగా తగ్గిస్తూ రావడంతో క్రమంగా ఆఫీస్‌ స్పేస్‌ కోసం లీజ్‌ డిమాండ్లు అక్టోబర్‌-డిసెంబర్‌ నెలల మధ్య 22 శాతం పెరిగిందని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. అంటే గతేడాది 5.43 మిలియన్ల చదరపు అడుగుల నుంచి ఈ ఏడాది 8.27 మిలియన్ల చదరపు అడుగులకు పెరిగింది.

ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో నెట్‌ ఆఫీస్‌ స్పేస్‌ అబ్జార్పషన్‌ 8.8 మిలియన్ల చదరపు అడుగులుగా ఉంటే, లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో అది రెండో త్రైమాసికంలో 3.32 మిలియన్ల చదరపు అడుగులకు పడిపోయింది. 

సగటు ఆఫీస్‌ స్పేస్‌ వాడకం స్థాయి 2016-2018 మధ్య మరింత వాస్తవిక దృక్పథకం కనబరించిందని జేఎల్‌ఎల్‌ ఇండియా అధిపతి కం సీఈవో రమేశ్‌ నాయర్‌ తెలిపారు. ఇక దక్షిణాది మార్కెట్లైన హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో నికర ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం 81 శాతానికి చేరిందన్నారు. ప్రత్యేకించి ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై లాక్‌డౌన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo