గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 23:47:17

ఎక్కడి నుంచైనా పని: ఎస్బీఐ

ఎక్కడి నుంచైనా పని: ఎస్బీఐ

ముంబై: దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుండటంతో బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) తన ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ కీలక చర్య వల్ల సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నదని బ్యాంక్‌ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు. మంగళవారం బ్యాంక్‌ 65వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం కల్పించడంతో వ్యాపారం అవాంతరం లేకుండా కొనసాగనున్నదన్నారు. కరోనా వైరస్‌తో బ్యాంకింగ్‌ రంగంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడనున్నదని, దీంతో ఈ ఏడాది బ్యాంక్‌ వ్యాపారం తీవ్ర ఒత్తిడికి గురికావచ్చునని చెప్పారు. ఈ ఇబ్బందికర పరిస్థితులను తట్టుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. 


logo