మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 09, 2020 , 14:18:44

పారిశ్రామిక రంగంవైపు మహిళలు దృష్టి పెట్టాలి: జయేశ్‌రంజన్‌

 పారిశ్రామిక రంగంవైపు మహిళలు దృష్టి పెట్టాలి: జయేశ్‌రంజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలు ఎంతో సమర్థులని, పారిశ్రామిక రంగంవైపు దృష్టిసారించాలని ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ ఐటీ హబ్‌లోని స్కైవ్యూలో ‘టీయరి’ టీ షాపును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీయరిని  ప్రారంభించేందుకు నీలిమ చేసిన కృషిని అభినందించారు. 40 రకాల అద్భుతమైన టీ ఇక్కడ లభిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎపిక్యూరస్‌ హోటల్స్‌ యజమాని మంతెన నాగరాజు, అనురాధ టింబర్‌ ఎస్టేట్స్‌ ఫౌండర్‌ చదలవాడ తిరుపతిరావు, డైరెక్టర్‌ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.
logo
>>>>>>