e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News విప్రో కీర్తి కిరీటంలో మ‌రో మైలురాయి.. అదేమిటంటే..!!

విప్రో కీర్తి కిరీటంలో మ‌రో మైలురాయి.. అదేమిటంటే..!!

విప్రో కీర్తి కిరీటంలో మ‌రో మైలురాయి.. అదేమిటంటే..!!

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గ‌జాల్లో ఒక్క‌టైన విప్రో గురువారం మ‌రో కీల‌క మైలురాయిని దాటింది. స్టాక్‌మార్కెట్ల ట్రేడింగ్‌లో విప్రో మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.3 ల‌క్ష‌ల కోట్ల మార్క్‌ను అధిగ‌మించింది. ఈ సంస్థ రూ.3 ల‌క్ష‌ల కోట్ల మార్క్‌ను దాట‌డం ఇదే తొలిసారి. అలాగే ఈ మైలురాయిని దాటిన మూడో భార‌తీయ ఐటీ సంస్థ‌.

రూ. 3 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌ను అధిగ‌మించిన మ‌రో రెండు ఐటీ దిగ్గ‌జాలుగా టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్ నిలిచాయి. దేశంలో మొత్తం 13 లిస్టెడ్ కంపెనీలు ఈ మైలురాయిని దాటాయి. ప్ర‌స్తుతం విప్రో నాలుగో స్థానంలో ఉంది.

విప్రో కీర్తి కిరీటంలో మ‌రో మైలురాయి.. అదేమిటంటే..!!

గురువారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో ప్రారంభంలోనే రూ.550 వ‌ద్ద ట్రేడ‌యింది. ఇంత‌కుముందు సెష‌న్ ట్రేడింగ్‌లో రూ.543.05 వ‌ద్ద ట్రేడ‌యింది. దీంతో పోలిస్తే గురువారం విప్రో షేర్ 1.27 శాతం పెరగ‌డంతో దాని మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.3.01 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ది.

భార‌త్ బెంచ్‌మార్క్.. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ స్వ‌ల్పంగా 0.6 శాతం పెరిగి 52,169 పాయింట్లకు చేరుకున్న‌ది. అయితే, స్క్వాడ్‌కాస్ట్ సంస్థ‌లో 12 ల‌క్ష‌ల డాల‌ర్ల మేర‌కు విప్రో పెట్టుబ‌డులు పెట్టింద‌న్న వార్త‌లొచ్చాయి. దీంతో విప్రో షేర్ దూసుకెళ్లింది.

సాఫ్ట్‌వేర్‌-యాజ్‌-ఏ-స‌ర్వీస్ (సాస్‌) స్టార్ట‌ప్‌తో క‌లిసి ఐటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్‌, సైట్ రిలియ‌ల‌బిలిటీ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ అందించేందుకు స్క్వాడ్‌కాస్ట్ సంస్థ‌తో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

విప్రో కీర్తి కిరీటంలో మ‌రో మైలురాయి.. అదేమిటంటే..!!

స్క్వాడ్‌కాస్ట్‌లో విప్రో వ్యూహాత్మ‌కంగా 20 శాతం వాటా కొనుగోలు చేయ‌నున్న‌ది. ఈ ఒప్పందం ఈ నెలాఖ‌రుక‌ల్లా పూర్తి కానున్న‌ద‌ని భావిస్తున్నారు.

అయితే, విప్రో సీఈవో కం ఎండీగా థెర్రీ డెలాపార్టే నియమితులైన‌ప్ప‌టి నుంచి సంస్థ షేర్ దూసుకెళుతున్న‌ది. విప్రో సీఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత సంస్థ‌లో లీడ‌ర్‌షిప్ స్థాయి అధికారుల‌ను 25 నుంచి న‌లుగురికి కుదించి వేస్తూ డెలాపోర్ట్ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏడాది కాలంగా విప్రో షేర్ 157 శాతం ల‌బ్ధి పొందింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 40 శాతం, గ‌త నెల‌లో 11.44 శాతం ల‌బ్ధి పొందింది. రూ.14.05 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్‌తో భార‌త దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిల‌య‌న్స్ నిలిచింది. త‌ర్వాత జాబితాలో రూ.11.58 ల‌క్ష‌ల కోట్ల‌తో టీసీఎస్, రూ.8.33 ల‌క్ష‌ల కోట్ల‌తో హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

ఇవి కూడా చ‌దవండి:

ఇంటి పెద్ద‌ను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?

ముకేశ్ అంబానీ గ‌తేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?

ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయ‌ల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథ‌నాల్ పెట్రోల్‌

టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…

2.27 కోట్లు.. ఏప్రిల్‌, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు

లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్‌

రికార్డు గ‌రిష్టానికి స్టాక్ మార్కెట్‌లు

ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

బిట్ కాయిన్ ముందు ఐదు స‌వాళ్లు.. అవేంటంటే?!

రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో

ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్ర‌ధానమంత్రిగా బెన్నెట్

నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా

Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్​ ఇదే..!

మ‌హేష్ ముంద‌డుగు.. అభిమానుల‌లో ఉత్సాహం

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విప్రో కీర్తి కిరీటంలో మ‌రో మైలురాయి.. అదేమిటంటే..!!

ట్రెండింగ్‌

Advertisement