బుధవారం 03 జూన్ 2020
Business - May 07, 2020 , 16:09:24

త్వరలో పాత వాహనాలకు బైబై

త్వరలో పాత వాహనాలకు బైబై

న్యూఢిల్లీ: కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాలంచెల్లిన వాహనాలు రోడ్లపై తిరుగకుండా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా నష్టపోయిన దేశీయ ఆటోమొబైట్‌ పరిశ్రమకు తోడ్పాటునందించడానికి పాలకాలపు వాహనాల స్క్రాపింగ్‌ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైనట్లు గురువారం ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ సొసైటీతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. 

వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా గత రెండేండ్లుగా ఈ పాలసీని తీసుకొచ్చేందుకు చాలా కృషిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ ఫైల్‌ ఆర్థికశాఖ అనుమతి కోసం పంపామని, ఆర్థిక శాఖ అనుమతి రాగానే వీలైనంత త్వరగా ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేస్తామన్నారు. ఉత్పత్తి, సామర్ధ్య వినియోగాన్ని పెంచే లక్ష్యంతో వాహనాల స్క్రాపేజ్‌ విధానాన్ని గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ప్రకటించారు.


logo