ఇవీ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్‌తో లాభాలు..

భవిష్యత్‌లో మనకేం జరుగుతుందో తెలియదు. అందుకని బీమా ప్రణాళిక చాలా ముఖ్యమైనది. సంక్షోభం వచ్చినప్పుడు మనతోపాటు మన కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉంటారని బీమా ప్రణాళిక నిర్ధారిస్తుంది. జీవిత బీమా, కారు బీమా, గృహ బీమా, ప్రయాణ బీమా, ఆరోగ్య బీమా.. ఇలా అనేక రకాల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. మన అవసరం ఏమిటో చూసుకుని ఆరోగ్య బీమా ఎంచుకోవడం ఉత్తమం. ఆరోగ్య బీమా వ్యక్తి ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉన్నందున కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.
మారుతున్న జీవనశైలితో పాటు పెరుగుతున్న వ్యాధుల కారణంగా దవాఖాన ఖర్చులు కూడా రెట్టింపవుతున్నాయి. తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు పని చేసే లేదా చిన్న వ్యాపారం చేసుకునే వారికి భారీ దవాఖాన ఖర్చులు చెల్లించడం సాధ్యమయ్యే పని కాదు. అందుకని, మీతోపాటు మీ కుటుంబానికి సరైన ఆరోగ్య బీమా పథకం ఉంటే అనారోగ్యం కారణంగా అయ్యే వైద్య ఖర్చులు నివారించుకోవచ్చు. ఇది కాకుండా, ఆరోగ్య బీమా పథకం అనేక ఇతర ప్రయోజనాలను కూడా ఇస్తుంది. నగదు రహిత చికిత్స పొందడానికి, హాస్పిటలైజేషన్ కవర్, డే కేర్ ట్రీట్మెంట్ కవర్, ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, టాక్స్ బెనిఫిట్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
మొదట చూసేదిదే..!
ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు మొదట చూసేది క్లెయిమ్ గురించే ఆలోచిస్తాం. అనారోగ్యంపాలైన సమయంలో మనకు డబ్బు అవసరమైనప్పుడు, బీమా సంస్థ ఎటువంటి అడ్డంకులను కలిగించదు. దీని కోసం మొదటి విషయం ఏమిటంటే.. ప్రారంభంలో మనం మన ఆరోగ్య పరిస్థితి గురించి సరైన సమాచారాన్ని బీమా ప్రొవైడర్‌కు ఇవ్వాలి. రెండవది.. మన పాలసీ రెన్యువల్ తేదీపై కూడా శ్రద్ధ వహించాలి. ఇక్కడ రెన్యువల్ అంటే.. సమయానికి ప్రీమియం చెల్లించడం అని గుర్తుంచుకోవాలి. పాలసీ సమయం ముగిసేలోగానే పాలసీని రెన్యువల్ చేయించుకోవాలి. తద్వారా దాని క్లెయిమ్‌లు లేదా ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. పాలసీని గడువు తేదీకి ముందు లేదా గ్రేస్ పీరియడ్‌లో రెన్యువల్ చేసుకోని పక్షంలో పాలసీ ముగుస్తుంది. అప్పుడు పాలసీని కొత్తగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. దీనిలో తక్కువ ప్రీమియం, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలను కోల్పోతారు. ఈ సమయంలో మీ ఆరోగ్యంలో మార్పు ఉంటే అదనపు ఒత్తిడి కూడా పెరుగుతుంది. పాలసీని రెన్యువల్ చేయడం వైద్య అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, రెన్యువల్‌ను ఎప్పటికీ మరిచిపోవద్దని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
రెన్యువల్ ఎక్కడ చేసుకోవాలి?
హెల్త్ పాలసీని కూడా ఇతర పాలసీల మాదిరిగానే ఆన్లైన్లో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. బేస్ పాలసీతో మరొక ప్లాన్‌ను జోడించాలనుకుంటే, దాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. రెన్యువల్ చేయించేసమయంలో మన వైద్య స్థితిలో మార్పుల గురించి కూడా అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు కూడా వివిధ కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. పిల్లలు, మహిళలు, గర్భిణిలు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం హెల్త్ పాలసీ అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య బీమా తీసుకునే ముందు నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోవాలి. పాలసీ తీసుకున్న తర్వాత రెన్యువల్ గడువు తేదీ, రాయితీ కాలం గురించి కూడా శ్రద్ధ వహించాలి, దీన్ని మరచిపోతే పాలసీని ముగిసిపోయి ఇబ్బందులు తలెత్తవచ్చు. క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్‌లో మన ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవాలనుకుంటే, ఆరోగ్య బీమా పాలసీని రెన్యువల్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోవద్దు.
ఇవి కూడా చదవండి..
అమెజాన్ ఇండియాకు డీజీజీఐ నోటీసు
డ్యూయిష్ బ్యాంక్‌కు రూ.2 కోట్ల జరిమానా విధింపు
ట్రంప్‌కు మరిన్ని దెబ్బలు తప్పవా..?!
అంతరిక్షం నుంచి నా దేశాన్ని చూస్తున్నా..
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- బిగ్‌బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
- టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్ ‘’ ఇన్ఫోసిస్
- రైతు సంఘాల్లో చీలిక.. వైదొలగిన రెండు సంఘాలు
- సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు
- 1000మంది గర్ల్ఫ్రండ్స్..1075 ఏళ్ల జైలు శిక్ష
- ఎస్ఐఎఫ్సీఏ కన్వీనర్‌గా పిట్టల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక