సోమవారం 03 ఆగస్టు 2020
Business - Jul 11, 2020 , 02:15:33

వ్యాక్సిన్‌ వస్తేనే బతుకు

వ్యాక్సిన్‌ వస్తేనే బతుకు

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గట్టెక్కేదీ అప్పుడే l భారత్‌పై కరోనా ప్రకోపం
  • పేదలు, ఎస్‌ఎంఈలకు ఆర్థిక చేయూత అవసరం: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌, జూలై 10: కరోనా వైరస్‌ను అంతమొందించే వ్యాక్సిన్‌, చికిత్సలు విస్తృతంగా అందుబాటులోకి వస్తేనే అన్ని దేశాలకు మనుగడ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వ్యాఖ్యానించింది. ఈ విపత్కర పరిస్థితి నుంచి అప్పుడే నిజంగా బయటపడగలుగుతామని ఐఎంఎఫ్‌ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ విటర్‌ గాస్పర్‌, సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్‌ గీతా గోపీనాథ్‌ అన్నారు. కాబట్టి వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటిదాకా 11 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇక భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని గాస్పర్‌ తెలిపారు. దేశ జీడీపీని ఈ మహమ్మారి రోజురోజుకూ కుంగదీస్తున్నదని శుక్రవారం పీటీఐతో అన్నారు. ఈ క్రమంలోనే దేశంలో బలహీన వర్గాలు, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్‌ఎంఈ)లకు సమీప భవిష్యత్తులో మరింతగా ఆర్థిక చేయూత అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 


logo