బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 13, 2020 , 00:06:10

వాట్సప్‌ @ 200 కోట్లు

వాట్సప్‌ @ 200 కోట్లు
  • ప్రపంచ జనాభాలో 25% మంది యూజర్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: వినియోగదారులను ఆకట్టుకోవడంలో వాట్సప్‌ దూసుకుపోతున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 200 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రపంచ జనాభాలో 25 శాతం మంది వాట్సప్‌ను వినియోగిస్తుండటం విశేషం. గతేడాది ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌..వాట్సప్‌కు నెలలో 150 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారని, ఒక్కరోజు 6000 కోట్ల మేసేజ్‌లు వెళ్లుతున్నాయని, వాట్సప్‌కు అతిపెద్ద మార్కెట్‌ భారతేనని వ్యాఖ్యానించారు. గతేడాది జూలైలో సంస్థకు భారత్‌లో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ సామాజిక వెబ్‌సైట్‌ వాట్సప్‌ వినియోగదారులు ప్రస్తుతం 200 కోట్లకు చేరుకున్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 
logo