శనివారం 06 మార్చి 2021
Business - Jan 19, 2021 , 18:44:20

గూగుల్‌పే పై ఫోన్‌పే పైచేయి:వాట్సాప్ రెట్టింపు

గూగుల్‌పే పై ఫోన్‌పే పైచేయి:వాట్సాప్ రెట్టింపు

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ అనుబంధ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ .. డిజిట‌ల్ పేమెంట్స్‌లో రికార్డు నెల‌కొల్పింది. 2020 న‌వంబ‌ర్‌తో పోలిస్తే డిసెంబ‌ర్ చెల్లింపులు రెట్టింప‌య్యాయి. యునైటెడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్ష‌న్ల‌లో వాట్సాప్ పేమెంట్స్‌దే పై చేయిగా నిలిచింది. న‌వంబ‌ర్ నెల‌తో పోలిస్తే డిసెంబ‌ర్‌లో లావాదేవీలు, చెల్లింపుల్లోనూ 100 శాతం పురోగ‌తి న‌మోదు చేసింది. గ‌త నెల‌లో యూపీఐ ద్వారా వాట్సాప్ పేమెంట్స్ రూ. 29.72 కోట్ల మేర‌కు చెల్లింపులు జ‌రిగాయి. లావాదేవీల్లో 8.1 ల‌క్ష‌ల చెల్లిపులుగా నిలిచాయ‌ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.

వాట్సాప్ పేమెంట్స్ సంస్థ‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న ఫోన్ పే ద్వారా 902.03 మిలియ‌న్లు, గూగుల్ పే ద్వారా 854.49 మిలియ‌న్ల లావాదేవీలు న‌మోద‌య్యాయి. వాల్‌మార్ట్ సారథ్యంలోని ఫోన్‌పే.. గూగుల్‌పేను  అధిగ‌మించింది.  ఫోన్ పే ద్వారా జ‌రిగిన చెల్లింపుల‌ మొత్తం విలువ రూ.1,82,126.88 కోట్లుగా ఉంది. అలాగే, 854.49 మిలియన్ల లావాదేవీలతో గూగుల్‌పే రెండో స్థానానికి చేరింది. దీనిలో జరిగిన డిజిటల్‌ చెల్లింపుల విలువ రూ.1,76,199.33 కోట్లుగా ఉంది.

ఎన్పీసీఐ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మొత్తం లావాదేవీల్లో 80 శాతం ఫోన్‌పే, గూగుల్‌పేల‌వే. ఇక మ‌రో డిజిట‌ల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం 261.09 మిలియ‌న్ల చెల్లింపులు జ‌రిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తోపాటు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ సొంత యాప్స్ ఆధ్వ‌ర్యంలో 10 శాతం డిజిట‌ల్ చెల్లింపులు రికార్డ‌య్యాయి.

ఇక మొత్తం గ‌త‌నెల‌లో 2.2 బిలియ‌న్ల లావాదేవీలు జ‌రుగ‌గా, రూ.4.16 ల‌క్ష‌ల కోట్ల చెల్లింపులు న‌మోద‌య్యాయ‌ని ఎన్పీసీఐ వెల్ల‌డించింది. మొత్తం డిజిట‌ల్ పేమెంట్స్‌లో ఎన్పీసీఐ సొంత యాప్.. భీం ఐదో స్థానంలో నిలిచింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo