బుధవారం 03 మార్చి 2021
Business - Feb 20, 2021 , 22:42:49

ఆల్‌టైం రికార్డుల్లో బిట్ కాయిన్‌.. కానీ..!!

ఆల్‌టైం రికార్డుల్లో బిట్ కాయిన్‌.. కానీ..!!

న్యూఢిల్లీ: క‌్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్ విలువ తాజా ట్రేడింగ్‌లో స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ల‌క్ష కోట్ల డాల‌ర్ల‌ను దాటితే.. తాజా ట్రేడింగ్‌లో దాని విలువ 56,520 డాల‌ర్ల‌ను తాకింది. భార‌త‌దేశంలో 70 ల‌క్ష‌ల మంది క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డులు పెట్టారు. భార‌త్‌లో చైనా పెట్టుబ‌డుల‌ను నిషేధించిన‌ట్లే క్రిప్టో క‌రెన్సీని కూడా నిషేధించ‌నున్న‌ట్లు వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. 

అయితే, ప్రైవేట్ క్రిప్టో క‌రెన్సీల ట్రేడింగ్‌ను నిషేధించే యోచ‌న‌లో కేంద్ర సర్కార్ ఉన్న‌ది. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్బీఐ) సొంతంగా డిజిట‌ల్ క‌రెన్సీని విడుద‌ల చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది. బిట్ కాయిన్‌తోపాటు ఇత‌ర క్రిప్టో క‌రెన్సీల‌తోపాటు ఇండియ‌న్ బ్లాక్ చెయిన్ స్టార్ట‌ప్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌పైనా నిషేధం అమ‌లులోకి వ‌చ్చే అవ‌కాశాలే ఫుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

డ్రాప‌ర్‌, ఆయోన్‌, సెక్యౌయా వంటి బిలియ‌న్ డాల‌ర్ల విలువ గ‌ల స్టార్ట‌ప్‌లు.. భార‌త బ్లాక్ చైన్ స్టార్ట‌ప్‌ల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. మ‌రోవైపు జెబ్ పే ఆవిష్క‌రించిన జెబ్ లాబ్ వంటి ఇండియ‌న్ బ్లాక్ చెయిన్ స్టార్ట‌ప్‌లు వేల మందిని నియ‌మించుకున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo