న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధ్రుతి.. చార్టర్డ్ జెట్ విమానాల యజమానులకు ట్రావెలర్స్ లాభాలు తెచ్చి పెట్టారు.. అవును ఇది నిజం.. హాలీడే ట్రిప్, బిజినెస్ పనులపై వెళ్లే వారు ఒక సిటీ నుంచి మరో సిటీకి ప్రయాణించడానికి ప్రైవేట్ చార్టర్డ్ జెట్ విమానం హైర్ చేసుకోవడానికి రూ.3.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేయడానికి వెనక్కి తగ్గలేదు.
కరోనాను నియంత్రించడానికి విధించిన ఆంక్షలతో.. భయాందోళనలతో బిజినెస్మెన్లు, పారిశ్రామికవేత్తలు.. సంపన్నులు విడి విడిగా, కుటుంబ సమేతంగా హాలీడే ట్రిప్‌లు, వ్యాపార లావాదేవీల కోసం ప్రైవేట్ విమానాలను హైర్ చేసుకున్నారు.
ముంబై నుంచి గోవాకు ఆరు సీటర్ల చార్టర్డ్ జెట్ విమానంలో ప్రయాణించడానికి రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు వ్యాపారులు.. ఒక్కో ప్యాసింజర్ తన ట్రిప్ కోసం రూ.60 వేలు చెల్లించారు. రోజువారీ వాణిజ్య విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో చార్టర్ జెట్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. అందుకు బుక్‌మై చార్టర్స్ అనే వెబ్సైట్లో ప్రైవేట్ చార్టర్డ్ విమానాల బుకింగ్స్ ఎక్కువయ్యాయి.
అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించడంతో మహమ్మారి ముందు స్థాయితో పోలిస్తే 70 శాతానికి పైగా చార్టర్డ్ విమానాల బుకింగ్స్ పెరిగాయని బరోన్ ఏవియేషన్ వెల్లడించింది. సంపన్నులు మిడిల్ ఈస్ట్, మాల్దీవులు, తదితర టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారు.
సుదీర్ఘ ప్రాంతాలకు అంటే అమెరికా-భారత్ మధ్య కూడా చార్టర్డ్ విమానాల హైరింగ్ పెరిగింది. దీపావళి తర్వాత సుదూర ప్రాంతాలకు చార్టర్డ్ ప్లైట్ల బుకింగ్స్ పెరుగుతాయని స్కై ట్రాక్స్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హేమల్ మోదీ తెలిపారు.
బోటిక్యూ ట్రావెల్ ఆపరేటర్ వెల్గ్రో ట్రావెల్స్.. వారానికి ఎమిరేట్స్‌కు రెండు చార్టర్డ్ విమానాలను నడుపుతున్నది. వాటిల్లో 19 సీట్లు ఉన్నా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిబంధనల ప్రకారం ఎనిమిది మంది ప్రయాణించడానికే అనుమతినిస్తుంది. భారత్‌లోని వివిధ సిటీలను బట్టి యూఏఈకి వెళ్లే విమాన సర్వీసుల చార్జీలు రూ.4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్‌లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్‌కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?