ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 29, 2021 , 15:33:16

వి-షేప్డ్ రిక‌వ‌రీ అంటే ఏంటో తెలుసా?

వి-షేప్డ్ రిక‌వ‌రీ అంటే ఏంటో తెలుసా?

న్యూఢిల్లీ: లోక్‌స‌భ‌లో శుక్ర‌వారం ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక స‌ర్వే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వి-షేప్డ్ రిక‌వ‌రీ సాధిస్తుంద‌ని అంచ‌నా వేసింది. ఈ నేప‌థ్యంలో అసలు వి-షేప్డ్ రిక‌వ‌రీ అంటే ఏంటి? అస‌లు రివ‌క‌రీల్లో ఇంకా ఏయే షేప్స్ ఉంటాయో ఒక‌సారి చూద్దాం. వి-షేప్డ్ (V-shaped) రిక‌వ‌రీ అనేది ఒక ఆర్థిక మాంద్యం, రివ‌క‌రీ ర‌కం. చార్టింగ్‌లో ఇది V ఆకారాన్ని క‌లిగి ఉంటుంది. మాంద్యాలు, రిక‌వ‌రీల‌ను ప‌రిశీలించే స‌మ‌యంలో ఆర్థిక వేత్త‌లు ఈ చార్జ్‌ల‌ను క్రియేట్ చేస్తారు. వీటిలో V ఆకారం రివ‌క‌రీ కూడా ఒక‌టి. వి అక్ష‌రం ఎలా ఉంటుందో తెలుసు క‌దా. ఆర్థిక వ్య‌వ‌స్థ ఎంత వేగంగా ప‌త‌న‌మ‌వుతుందో అంతే వేగంగా మ‌ళ్లీ మునుప‌టి స్థాయికి పుంజుకోవ‌డాన్ని V షేప్డ్ రిక‌వ‌రీ అంటారు. 

మిగ‌తా రిక‌వ‌రీ షేప్స్ ఏంటి?

ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వి-షేప్డ్ రిక‌వ‌రీలాగే మ‌రిన్ని రిక‌వ‌రీలు కూడా ఉంటాయి. వాటిలో ఎల్‌-షేప్డ్‌, డ‌బ్ల్యూ-షేప్డ్‌, యు-షేప్డ్‌, జే-షేప్డ్ వంటివి ఉంటాయి. ప్రతి రకమైన రికవరీ.. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేసే ఆర్థిక కొలమానాల చార్ట్ ఆకారాన్ని సూచిస్తుంది. జీడీపీ, ఉపాధి రేట్లు‌, ప‌రిశ్ర‌మల ఉత్ప‌త్తి సూచీల వంటి ఆర్థిక వ్య‌వ‌స్థ చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా ఆర్థిక వేత్త‌లు ఈ చార్జ్‌ల‌ను త‌యారు చేస్తారు. వి-షేప్డ్ రిక‌వ‌రీ విష‌యానికి వ‌స్తే ఆర్థిక వ్య‌వ‌స్థ ఎంత వేగంగా ప‌త‌న‌మ‌వుతుందో మ‌ళ్లీ అంతే వేగంగా పుంజుకుంటుంది. 

VIDEOS

logo