బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 06, 2020 , 00:15:32

సేవింగ్స్‌ ఖాతాల్లో వడ్డీ ఎంత?

సేవింగ్స్‌ ఖాతాల్లో వడ్డీ ఎంత?

ప్రతి మూడు నెలలకొకసారి పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను మారుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.  జూలై-సెప్టెంబర్‌ మధ్య కాలానికిగాను చిన్న మొత్తాల పొదుపు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీంలకు చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాలపై వడ్డీని 4 శాతంగా కొనసాగిస్తున్నది. వీటి వివరాలు...

  • పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌: 15 ఏండ్లలో మెచ్యూర్‌ కానున్న దీర్ఘకాలిక పొదుపులపై 7.1 శాతం వడ్డీ లభించనున్నది.
  • సుకన్య సమృద్ధి యోజన: ఆడ పిల్లల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంపై 7.6 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది. 
  • సీనియర్‌ సిటిజన్‌ స్కీం: సీనియర్‌ సిటిజన్‌ స్కీంపై 7.4 శాతం వడ్డీని అందిస్తున్నాయి బ్యాంకులు.
  • జాతీయ పొదుపు సర్టిఫికెట్‌: జాతీయ పొదుపు సర్టిఫికెట్‌ కింద జమ చేసిన నిధులపై 6.8 శాతం వడ్డీ లభించనున్నది. 
  • పోస్టాఫీసుల్లో: ఐదేండ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.8 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నది పోస్టాఫీసు. 
  • కిసాన్‌ వికాస్‌ పత్రం: 124 నెలల్లో మెచ్యూర్‌ కానున్న కిసాన్‌ వికాస్‌ పత్రాలపై 6.9 శాతం వడ్డీ లభిస్తున్నది.


logo