గురువారం 04 మార్చి 2021
Business - Jan 28, 2021 , 17:41:20

కొవిడ్‌ షాక్‌ : పసిడి డిమాండ్‌ భారీ పతనం

కొవిడ్‌ షాక్‌ : పసిడి డిమాండ్‌ భారీ పతనం

లండన్‌ : గత ఏడాది కొవిడ్‌-19 వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా పసిడికి డిమాండ్‌ 11 ఏళ్ల కనిష్టస్ధాయికి పడిపోయింది. బంగారానికి గిరాకీ తగ్గడంతో ఇన్వెస్టర్లు, జ్యూవెలర్ల వద్ద పసిడి నిల్వలు పేరుకుపోయాయి. రిటైల్‌ కొనుగోళ్లతో పాటు, కేంద్ర బ్యాంక్‌లు సైతం యల్లో మెటల్‌ కొనుగోళ్లకు దూరమయ్యాయని పరిశ్రమ నివేదిక వెల్లడించింది. ఆభరణాల మార్కెట్‌లో డిమాండ్‌ లేకున్నా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో 2020లో బంగారం ధరలు 25 శాతం ఎగబాకాయి. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్‌ 14 శాతం పతనమై 3759.6 టన్నులకు పడిపోయింది.

2009 తర్వాత గోల్డ్‌ డిమాండ్‌ తొలిసారిగా 4000 టన్నుల దిగువకు పతనమైందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా త్రైమాస నివేదికలో పేర్కొంది. ఇక 2020లో పలు దేశాల కేంద్ర బ్యాంక్‌లు కేవలం 273 టన్నుల బంగారాన్నే సమీకరించాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 59 శాతం పడిపోయిందని తెలిపింది. మరోవైపు కరోనా వైరస్‌ వెంటాడటంతో మైనింగ్‌ కార్యకలాపాలకు అవాంతరాలు ఎదురై పసిడి సరఫరాలు సైతం గత ఏడాది నాలుగు శాతం పడిపోయాయని డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. 

VIDEOS

logo