శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 23, 2021 , 22:49:15

వ‌ర్క్ ఫ్రం హోం: అతివ‌ల‌కే కార్పొరేట్ల ఓటు!

వ‌ర్క్ ఫ్రం హోం: అతివ‌ల‌కే కార్పొరేట్ల ఓటు!

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డం.. మ‌రోవైపు దాని ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి సిబ్బందికి వ‌ర్క్ ఫ్రం హోం ఆఫ‌ర్ ఇచ్చాయి ఐటీ సంస్థ‌లు. ఈ ఆఫ‌ర్‌తో మ‌హిళా ప్రొఫెష‌న‌ల్స్‌కు ఉద్యోగావ‌కాశాలు పెరిగాయి. జాబ్స్ ఫ‌ర్ హ‌ర్ అనే సంస్థ అధ్య‌య‌నం ప్ర‌కారం మ‌హిళా నిపుణుల‌కు 22 శాతం ఉద్యోగ అవ‌కాశాలు ఎక్కువ‌య్యాయ‌ని తేలింది. ప‌ని ప్ర‌దేశంలో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేందుకు వ‌ర్క్ ఫ్రం హోం స‌రైంద‌ని జాబ్స్ ఫ‌ర్ హ‌ర్ వ్య‌వ‌సాప్థ‌కురాలు నెహా బ‌గారియా చెప్పారు.

క‌రోనా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన త‌ర్వాత అమ‌లులోకి వ‌చ్చిన న్యూ నార్మ‌ల్ ప‌ద్ద‌తుల్లో ఉద్యోగ నియామ‌కాలు పెరిగాయ‌ని, దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు మ‌రికొన్ని ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌బ‌డ్డాయ‌న్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే 2020లో వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో మ‌హిళా భాగ‌స్వామ్యానికి 27 శాతం డిమాండ్ పెరిగింది. 

ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు కేవ‌లం ప్ర‌థ‌మ‌శ్రేణి న‌గ‌రాల్లో మాత్ర‌మే కాక‌, ద్వితీయ‌, త్రుతీయ శ్రేణి సిటీల్లో ఉపాధి అవ‌కాశాలు మెరుగ‌య్యాయి. జూలై, ఆగ‌స్టుల్లో ద్వితీయ‌, త్రుతీయ శ్రేణి న‌గ‌రాల్లో 25 శాతం మ‌హిళ‌ల‌కు ఉద్యోగ అవ‌కాశాలు ఎక్కువ అ‌య్యాయి. 2019తో పోలిస్తే ఉద్యోగ ద‌ర‌ఖాస్తుల్లో 118 శాతం గ్రోత్ న‌మోదైంద‌ని జాబ్స్ ఫ‌ర్ హ‌ర్ స‌ర్వేలో తేలింది. ఆన్ లైన్ రిక్రూట్‌మెంట్‌పై 1000 మందికి పైగా వ్య‌క్తుల అభిప్రాయాలు సేక‌రించామ‌ని ఈ సంస్థ తెలిపింది. 90 శాతం మ‌హిళ‌లు త‌మ‌కు వ‌ర్చువ‌ల్ హైరింగ్‌, క‌న్వినియెంట్‌గా ఉంటుంద‌ని చెప్పారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo