అద్భుత బడ్జెట్ తెస్తాం

- జీవనోపాధి, ఆరోగ్య రంగాలకు పెద్దపీట: నిర్మల
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను మునుపెన్నడూ లేనంత అద్భుతమైన బడ్జెట్‌ను ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భరోసా ఇచ్చారు. కరోనా ప్రభావంతో చితికిపోయిన అన్ని రంగాలను బలోపేతం చేయడానికి, పడిపోయిన వృద్ధిరేటును తిరిగి నిలబెట్టడానికి గత వందేండ్లలో ఎప్పుడూ చూడని బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్నారు. ఇందుకు పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అవసరమని కోరారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) భాగస్వామ్య సదస్సు-2020 ను ఉద్దేశించి నిర్మల మాట్లాడారు. ఈసారి బడ్జెట్లో జీవనోపాధి, ఆరోగ్య సంరక్షణ రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. కాగా, ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది కీలకపాత్రేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2021-22 కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు