e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News గేట్స్ ఫౌండేష‌న్ ట్ర‌స్టీగా త‌ప్పుకున్న‌ వారెన్ బ‌ఫెట్

గేట్స్ ఫౌండేష‌న్ ట్ర‌స్టీగా త‌ప్పుకున్న‌ వారెన్ బ‌ఫెట్

గేట్స్ ఫౌండేష‌న్ ట్ర‌స్టీగా త‌ప్పుకున్న‌ వారెన్ బ‌ఫెట్

న్యూయార్క్ : బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ (బీఎంజీ) ట్ర‌స్టీగా ప్ర‌పంచ కుబేరుడు వారెన్ బ‌ఫెట్ త‌ప్పుకున్నారు. 27 ఏండ్ల వైవాహిక బంధం నుంచి విడిపోతున్న‌ట్టు బిల్, మెలిండా గేట్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచంలోని అతిపెద్ద ఛారిటీ ఫౌండేష‌న్ నుంచి వారెన్ బ‌ఫెట్ నిష్క్ర‌మ‌ణ నిర్ణ‌యం వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం. 100 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా సంప‌ద‌తో గ‌తంలో ప్ర‌పంచంలోనే అత్యంత కుబేరుడిగా నిలిచిన బ‌ఫెట్ తాజా నిర్ణ‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

చాలా ఏండ్లుగా ట్ర‌స్టీగా ఉన్న తాను ప్ర‌స్తుతం చురుకుగా లేన‌ని, బెర్క్‌షైర్ మిన‌హా ఇత‌ర కార్పొరేట్ బోర్డుల నుంచి వైదొల‌గిన త‌ర‌హాలోనే ఆ ప‌ద‌వికీ తాను రాజీనామా చేస్తున్నాన‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో బ‌ఫెట్ పేర్కొన్నారు.బీఎంజీ సీఈఓగా అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న మార్క్ సుజ్‌మ‌న్‌కు తాను పూర్తిగా మ‌ద్ద‌తిస్తాన‌ని సంస్థ ల‌క్ష్యాలు చేరుకోవ‌డంలో ఫౌండేష‌న్‌కు ప్ర‌స్తుతం భౌతికంగా త‌న సేవ‌లు అవ‌స‌రం లేద‌ని అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గేట్స్ ఫౌండేష‌న్ ట్ర‌స్టీగా త‌ప్పుకున్న‌ వారెన్ బ‌ఫెట్
గేట్స్ ఫౌండేష‌న్ ట్ర‌స్టీగా త‌ప్పుకున్న‌ వారెన్ బ‌ఫెట్
గేట్స్ ఫౌండేష‌న్ ట్ర‌స్టీగా త‌ప్పుకున్న‌ వారెన్ బ‌ఫెట్

ట్రెండింగ్‌

Advertisement