సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 07, 2020 , 00:32:27

బఫెట్‌కు భారీ నష్టం

బఫెట్‌కు భారీ నష్టం

న్యూయార్క్‌: అమెరికా వ్యాపారవేత్త, బెర్క్‌షైర్‌ హాథవే అధినేత వారెన్‌ బఫెట్‌కు కాలం కలసి రావడంలేదు. ఈ ఏడాది అమెరికా స్టాక్‌ మార్కెట్లు 40% మేర పెరిగినా బఫెట్‌ సంపద దాదాపు రూ.1.4 లక్షల కోట్లు తరిగిపోయింది. దీంతో ఈ ఏడాది అత్యధికంగా నష్టపోయిన ప్రపంచ కుబేరుల్లో ఆయనే అగ్రస్థానంలో నిలిచినట్టు బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. అయినా 70.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ధనికుల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నట్టు తెలిపింది.


logo