బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Mar 19, 2020 , 00:48:16

ఫోక్స్‌వ్యాగన్‌ నుంచి టీ-రాక్‌

ఫోక్స్‌వ్యాగన్‌ నుంచి టీ-రాక్‌

  •  ధర రూ.20 లక్షలు

న్యూఢిల్లీ, మార్చి 18: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ టీ-రాక్‌ కారును విడుదల చేసింది ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.19.99 లక్షలకు లభించనున్నది. 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారును ఏడు గేర్లు, స్పోర్ట్‌ డిజైన్‌, భద్రత ప్రమాణాలు, టెక్నాలజీ, నూతన డ్రైవింగ్‌ అనుభవం కల్పించడానికి పలు మార్పులు చేసినట్లు కంపెనీ డైరెక్టర్‌ స్టీఫెన్‌ క్నాప్‌ తెలిపారు. ఎస్‌యూవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కారును విడుదల చేసినట్లు, దీంట్లో ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ స్టేబిలిటీ కంట్రోల్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, రివర్స్‌ కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 


logo
>>>>>>