సోమవారం 01 మార్చి 2021
Business - Feb 14, 2021 , 22:37:12

ఆపిల్ విద్యుత్ కారంటే భ‌యం లేదు: ‌వోక్స్ వ్యాగ‌న్‌

ఆపిల్ విద్యుత్ కారంటే భ‌యం లేదు: ‌వోక్స్ వ్యాగ‌న్‌

ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌: విద్యుత్ కార్ల మార్కెట్‌ను గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ రాత్రికి రాత్రి మార్చేయ‌లేద‌ని జ‌ర్మ‌నీ ఆటోమొబైల్ దిగ్గ‌జం వోక్స్ వ్యాగ‌న్ పేర్కొన్న‌ది. విద్యుత్ కారును త‌యారు చేయాల‌న్న గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్ ప్ర‌ణాళిక‌ల‌పై త‌మ‌కేమీ ఆందోళ‌న లేద‌ని తేల్చి చెప్పింది. ఐఫోన్ బ్యాట‌రీ టెక్నాల‌జీతో అభివ్రుద్ధి చేసే కారు గురించి త‌మ‌కు ఆందోళ‌నే లేద‌ని వోక్స్ వ్యాగ‌న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈవో) హెర్బ‌ర్ట్ డైస్ వ్యాఖ్యానించారు. 

2024 నాటికి బ్యాట‌రీ టెక్నాల‌జీ త‌యారీలో వ్య‌యం త‌గ్గిస్తూ మాస్ మార్కెట్‌కు అనువైన విద్యుత్ కారు త‌యారీ పురోగ‌తిలో ఉండొచ్చున‌ని డిసెంబ‌ర్‌లోనే రాయిట‌ర్ వార్తాసంస్థ పేర్కొంది. ఇప్ప‌టికైతే, విద్యుత్ కార్ల త‌యారీ విష‌య‌మై ఆపిల్ త‌న ప్ర‌ణాళిక‌ను బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

బ్యాట‌రీలు, సాఫ్ట్‌వేర్‌, డిజైన్ల‌లో అనుభ‌వం క‌లిగి ఉన్న ఆపిల్‌.. ఇత‌ర‌ సంస్థ‌ల‌కు పోటీగా కార్ల‌ను త‌యారు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగి ఉంద‌న్నారు హెర్బ‌ర్ట్ డైస్ తెలిపారు. వోక్స్ వ్యాగ‌న్ సైతం అటాన‌మ‌స్ కారు త‌యారీకి అవ‌స‌ర‌మైన సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్ చేయాల‌ని ప్ర‌ణాళిక రూపొందిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo