సోమవారం 30 నవంబర్ 2020
Business - Sep 26, 2020 , 00:42:11

వొడాఫోన్‌కు భారీ ఊరట

వొడాఫోన్‌కు భారీ ఊరట

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్‌కు భారీ ఊరట లభించింది.  భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన  రూ.22 వేల కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో సానుకూలంగా తీర్పు వచ్చిందని వొడాఫోన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. బకాయిలు రూ.12 వేల కోట్లతోపాటు రూ.7,900 కోట్ల జరిమానా చెల్లింపులపై వొడాఫోన్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విష యం తెలిసిందే. స్పెక్ట్రమ్‌ వాడకం, లైసెన్స్‌ ఫీజులకు సంబంధించి తలెత్తిన వివాదంపై వొడాఫోన్‌ 2016లో సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిటేషన్‌ కేంద్రాన్ని ఆశ్రయించింది. వొడాఫోన్‌పై కేంద్ర ప్రభుత్వం మోపిన పన్ను భారం.. భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్దమని ట్రిబ్యునల్‌  రూలింగ్‌ ఇచ్చినట్టు కంపెనీ పేర్కొంది. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి.