సోమవారం 01 మార్చి 2021
Business - Feb 14, 2021 , 02:11:57

వొడాఫోన్‌ ఐడియా నష్టం 4,532 కోట్లు

వొడాఫోన్‌ ఐడియా నష్టం 4,532 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.4,532.10 కోట్ల కన్సాలిడేటెడ్‌ నష్టం వచ్చినట్లు ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఏడాది క్రితం వచ్చిన రూ.6,438.80 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.7 శాతం తగ్గి రూ.10,894 కోట్లకు పరిమితమైనట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఇది రూ.11,089 కోట్లుగా ఉన్నది. రూ.25 వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని కంపెనీ సీఈవో రవీందర్‌ టక్కర్‌ తెలిపారు.

VIDEOS

logo