మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 02:06:50

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

  • సిబ్బందిని 50 వేలకు పెంచుకోనున్న సంస్థ

న్యూఢిల్లీ: చైనా సంస్థ వివో భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఇండస్ట్రియల్‌ డిజైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. అంతేకాకుండా భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను 50 వేలకు పెంచనున్నట్టు వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ విభాగ డైరెక్టర్‌ నిపుణ్‌ మార్యా వెల్లడించారు. గురువారం జరిగిన వర్చువల్‌ ఈవెంట్‌లో ఆయన వివో ఎక్స్‌-50 సిరీస్‌ ఫోన్లను ఆవిష్కరించారు. వీటిలో ఎక్స్‌-50 వేరియంట్‌ ప్రారంభ ధరను రూ.34,990గా, ఎక్స్‌-50 ప్రో వేరియంట్‌ ధరను రూ.49,990గా నిర్ణయించారు. ఈ ఫోన్లతో తాము 5జీ టెక్నాలజీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు మార్యా ప్రకటించారు. అంతేకాకుండా టీడబ్ల్యూఎస్‌ నియో వైర్లెస్‌ ఇయర్‌ఫోన్స్‌తో మొబైల్‌ యాక్సెసరీస్‌ విభాగంలోకి వివో అడుగుపెడుతున్నట్టు తెలిపారు.logo