న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కార పథకం గడువును వచ్చే జూన్ 30 వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శనివారం కేంద్రం ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పన్ను చెల్లింపునకు టాక్స్ పేయర్లు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అంటే పన్ను చెల్లింపుదారులకు మరో రెండు నెలలు రిలీఫ్ లభించనున్నది.
అదే సమయంలో ఆదాయం వివరాలు ఇంకా అంచనా వేయని కేసుల్లో పున: అంచనా వేయాలని కోరుతూ పన్ను చెల్లింపు దారులకు పన్నులశాఖ అధికారులు నోటీసులు ఇచ్చే గడువును కూడా జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన చేసింది.
ప్రత్యక్ష పన్నుల వివాదం నుంచి ట్రస్ట్ యాక్ట్ 2020 కింద పన్ను బకాయిల చెల్లింపునకు గడువును జూన్ 30 వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది. ఈ యాక్ట్ కింద పన్ను చెల్లించడానికి ముందుకు వచ్చే వారు అదనంగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
పన్ను చెల్లింపు దారులకు డిక్లరేషన్ సమర్పించడానికి మార్చి 31 వరకు ఉన్న గడువును పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. వివాదాస్పద పన్ను, వివాదాస్పద పెనాల్టీ, వివాదాస్పద వడ్డీరేటుపై ట్రస్ట్ స్కీమ్ కింద సెటిల్మెంట్ చేసుకోవచ్చు.
ప్రత్యక్ష పన్ను వివాదం నుంచి 2020 మార్చి 17వ తేదీన అమలులో్కి వచ్చిందే ట్రస్ట్ లా. టాక్స్ పేయర్లకు సంబంధించి వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ఆల్టర్నేటివ్ స్కీమ్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్‌టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ