బుధవారం 23 సెప్టెంబర్ 2020
Business - Aug 06, 2020 , 00:10:54

వర్జిన్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా

వర్జిన్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా

  • అమెరికా కోర్టులో పిటిషన్‌
  • వైరస్‌ దెబ్బకు కంపెనీ కుదేలు

న్యూయార్క్‌: వర్జిన్‌ అట్లాంటిక్‌ దివాలా తీసింది. సంస్థ రక్షణార్థం అమెరికా దివాలా కోర్టును ఆశ్రయించింది. కరోనా మహమ్మారి రవాణా రంగాన్ని పూర్తిగా కుదిపేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విమానయాన రంగం వైరస్‌ దెబ్బకు చితికిపోయింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో దివాలా ప్రక్రియకు వెళ్లిన వర్జిన్‌ అట్లాంటిక్‌.. అమెరికాలోనూ ఆ పనికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే అమెరికా ఫెడరల్‌ బ్యాంక్ప్స్రీ కోర్టులో చాప్టర్‌ 15ను దాఖలు చేసింది. సంస్థ రుణదాతలు దివాలా ప్రక్రియకు మద్దతునిస్తున్నారని, తిరిగి నిలదొక్కుకోగలమన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వర్జిన్‌ అట్లాంటిక్‌ ప్రతినిధి వ్యక్తం చేశారు. సంస్థ నిర్వహణ భారంగా మారడంతో ఇప్పటికే వందలాది ఉద్యోగులను తొలగించారు.


logo