మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 18, 2020 , 03:36:58

13,960 కోట్లు చెల్లిస్తా.. వివాదాల పరిష్కారానికి మాల్యా ఆఫర్‌

13,960 కోట్లు చెల్లిస్తా.. వివాదాల పరిష్కారానికి మాల్యా ఆఫర్‌

న్యూఢిల్లీ: విజయ్‌ మాల్యాకు ఉచ్చు బిగుస్తున్నది. దేశంలోని పలు బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన మాల్యాను బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు అప్పగించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో న్యాయపరంగా అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో మాల్యా స్వరం మార్చారు. బ్యాంకుల కన్సార్టియంతో వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు సెటిల్మెంట్‌ ప్యాకేజీతో మాల్యా ముందుకొచ్చినట్టు ఆయన తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలియజేశారు. కానీ వివాద పరిష్కారానికి మాల్యా ఆఫర్‌ చేసిన ప్యాకేజీ ఎంతో ఆయన వెల్లడించలేదు. అయితే అసలు రుణాలు, వాటిపై వడ్డీ కలిపి బ్యాంకులకు రూ.13,960 కోట్లు చెల్లించేందుకు  మాల్యా ముందుకొచ్చినట్లు అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. 


logo