ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 19, 2021 , 00:04:43

శాంసంగ్‌ వీపీకి రెండున్నరేండ్ల జైలు శిక్ష

శాంసంగ్‌ వీపీకి రెండున్నరేండ్ల జైలు శిక్ష

సియోల్‌, జనవరి 18: అవినీతి కేసులో శాంసంగ్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ లీ జే యాంగ్‌కు రెండున్నరేండ్ల జైలు శిక్ష పడింది. 2016లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్‌ గెయున్‌ హైకి లంచం ఇచ్చినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న యాంగ్‌కు సియోల్‌ హైకోర్టు సోమవారం ఈ శిక్షను ఖరారు చేసింది. వాస్తవానికి ఈ కేసులో యాంగ్‌కు 2017లోనే ఐదేండ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. 2018లో ఈ శిక్షను రెండున్నరేండ్లకు తగ్గించారు. దీనిపై 2019లో మరోసారి విచారణ జరిపిన సియోల్‌ హైకోర్టు.. తాజాగా యాంగ్‌కు రెండున్నరేండ్ల శిక్షను ఖరారు చేసింది. 


VIDEOS

logo