శుక్రవారం 05 జూన్ 2020
Business - May 16, 2020 , 23:47:42

సరఫరాలు తగ్గడం వల్లే..

సరఫరాలు తగ్గడం వల్లే..

  • చికెన్‌ ధరల పెరుగుదలపై వెంకటేశ్వర హేచరీస్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో ఇటీవల గణనీయంగా పతనమైన పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.284కు, డజను కోడిగుడ్ల ధర రూ.54కు చేరింది. గత రెండు నెలల్లో అనేకమంది రైతులు కొత్తగా కోళ్లను పెంచకపోవడంతో పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరా తగ్గిందని, అందుకే ధరలు పెరిగాయని వెంకటేశ్వర హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జీఎం (ఇంటిగ్రేషన్‌) బాలసుబ్రమణియన్‌ వెల్లడించారు. పౌల్ట్రీ ఉత్పత్తుల వినియోగం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించడంతో గత నెలరోజుల నుంచి ప్రజలు వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారని, ధరల పెరుగుదలకు ఇది మరో కారణమని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ వల్ల రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫుడ్‌కోర్టులు మూతపడటంతో పౌల్ట్రీ ఉత్పత్తులను గృహావసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారని, లేకపోతే ధరలు మరింత పెరిగేవని అన్నారు. లాక్‌డౌన్‌ను ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయని, దీంతో మున్ముందు పౌల్ట్రీ ఉత్పత్తులకు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశమున్నదని ఆయన తెలిపారు.


logo