శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Aug 02, 2020 , 00:18:36

హమ్మయ్య ఆటో

హమ్మయ్య ఆటో

  • జూలైలో వాహన అమ్మకాల్లో మిశ్రమ వృద్ధి

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా భారీగా పడిపోయిన వాహన అమ్మకాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో నెలో జూలైలో కార్ల తయారీ దిగ్గజం  మారుతి సుజుకీ దేశవ్యాప్తంగా లక్షకు పైగా కార్లను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన లక్షతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ మాత్రమైన కార్లను విక్రయించడం గమనార్హం. కానీ, మరో సంస్థ హ్యుందాయ్‌ విక్రయాలు రెండు శాతం వరకు పడిపోగా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్‌ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. గత నెలలో మారుతి 1.08 లక్షల వాహనాలు అమ్మగా, హ్యుందాయ్‌ మోటర్‌ 38,200 యూనిట్లు, మహీంద్రా 24,211, టయోటా కిర్లోస్కర్‌  5,386 యూనిట్ల అమ్మకాలు జరిపాయి. కరోనా వైరస్‌ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందన్నడానికి ఈ వాహన విక్రయాలే నిదర్శనమని, వ్యక్తిగత రవాణా కోసం  కార్లను వినియోగించేవారికి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. జూన్‌తో పోలిస్తే జూలైలో అమ్మకాలు ఊపందుకున్నాయని, వచ్చేది పండుగ సీజన్‌ కావడంతో మరింత పెరిగే అవకాశం ఉన్నదని టీకేఎం వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోనీ తెలిపారు.  

547 జీప్‌ల రీకాల్‌

వాహన తయారీ సంస్థ ఎఫ్‌సీఏ ఇండి యా..547 యూనిట్ల ‘మై20 జీప్‌ కంపాస్‌లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వాహనాల్లో బ్రేస్‌ నట్‌ సమస్యలు తలెత్తడంతో వెనక్కి పిలువాలని నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  రెగ్యులర్‌ వాహన చెకప్‌లో భాగంగా ప్రస్తుత సంవత్సరంలో తయారైన మైజీప్‌ కంపాస్‌ వాహనాల్లో ఈ సమస్యను గుర్తించినట్లు, వీటిని ఉచితంగా మరమ్మత్తు చేసి తిరిగి వినియోగదారులకు అందచేయడం జరుగుతున్నదని తెలిపింది. logo