బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Oct 25, 2020 , 00:57:27

వేదాంత రూ.9.50 డివిడెండ్‌

వేదాంత రూ.9.50 డివిడెండ్‌

న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంత లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తొలి మధ్యంతర డివిడెండ్‌ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. షేరు ఒక్కింటికి రూ.9.50 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించబోతున్నది. ఇందుకోసం రూ.3,500 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించింది. డీ-లిస్టింగ్‌ విఫలమైన వారం రోజుల్లో ఈ మధ్యంతర డివిడెండ్‌ తెరపైకి తీసుకురావడం విశేషం. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.9.50 లేదా 950 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.