బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 13, 2020 , 00:11:55

సెలెక్ట్‌లో వాలంటైన్స్‌డే ఆఫర్లు

సెలెక్ట్‌లో వాలంటైన్స్‌డే ఆఫర్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రిటైల్‌ మొబైల్‌ విక్రయ సంస్థ సెలెక్ట్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ది గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 13 నుంచి 14 వరకు రెండు రోజుల పాటు అమలులో ఉండనున్నాయని కంపెనీ ఫౌండర్‌, చైర్మన్‌ వై గురు తెలిపారు. కంపెనీ వృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమైనదని, వీరికి ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఎంపిక చేసిన మోడళ్లపై భారీ రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. 


వీటిలో రూ.8,999 విలువైన 3జీబీ+32జీబీ 4జీ మొబైల్‌ను కేవలం రూ.3,999కే అందిస్తున్న సంస్థ.. రూ.6,999 ధర కలిగిన మైజు స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999కే, రూ.25,500 విలువైన సామ్‌సంగ్‌ ఏ6ని రూ.8,999కే, రూ.3,999 విలువైన బ్లూటూత్‌ టీడబ్ల్యూస్‌ను రూ.1,499కి, 1,999 ధర కలిగిన బ్లూటూత్‌ స్పీకర్‌ను రూ.399కే, రూ.3,928 విలువైన 10 వేల ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌, బ్లూటూత్‌ నెక్‌బ్యాండ్‌ను కేవలం రూ.1,499కే విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటితోపాటు రూ.12,143కి టీసీఎల్‌ ఎల్‌ఈడీని కొనుగోలు చేసిన వారికి ఉచితంగా హోమ్‌ థియేటర్‌ సిస్టమ్‌ను అందిస్తున్నది సంస్థ. ప్రస్తుతం సంస్థకు తెలుగు రాష్ర్టాల్లో 65 రిటైల్‌ అవుట్‌లెట్లు ఉండగా, వచ్చే ఉగాది రోజు మరో ఐదు షోరూంలను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. 


logo