e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News అందరికీ వ్యాక్సినేషన్‌కు ఎంతంటే..!?

అందరికీ వ్యాక్సినేషన్‌కు ఎంతంటే..!?

అందరికీ వ్యాక్సినేషన్‌కు ఎంతంటే..!?

న్యూఢిల్లీ: క‌రోనా రెండో వేవ్‌తో ఇండియ‌న్లంతా అల్లాడుతున్నారు. కుటుంబాల‌కు కుటుంబాలు ఎప్పుడేమీ జ‌రుగుతుందోన‌ని అగ్గ‌ల్లాడుతున్నాయి. ఇంత‌కుముందు 45 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌డ‌తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. మ‌హ‌మ్మారి తీవ్ర‌త పెరిగిపోతుండ‌టంతో కేంద్రం మ‌రో అడుగు ముందుకేసి మే ఒక‌టో తేదీ నుంచి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేష‌న్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

అంద‌రికీ ఉచితంగా వ్యాక్సినేష‌న్ త‌మ వ‌ల్ల కాద‌ని కేంద్రం తేల్చేసింది. ప్రైవేట్‌గా బ‌హిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్ కొనుగోలు చేసి వేసుకోవాల్సిందేన‌ని సంకేతాలిచ్చింది. త‌ద‌నుగుణంగా గ్లోబ‌ల్ వ్యాక్సిన్ల త‌యారీ సంస్థ సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వ్యాక్సిన్ విక్ర‌య ధ‌ర‌లు ప్ర‌క‌టించ‌డంతో అస‌లు సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది.

సీరం సంస్థ కేంద్రానికి రూ.150ల‌కే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసింది. కేంద్రం రాష్ట్రాల‌తోపాటు ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేసింది. తాజాగా కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.400, ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు రూ.600ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని సీరం ధ‌ర‌లు ప్ర‌క‌టించింది. దీంతో అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా కావ‌డం లేద‌ని తేలింది.

కానీ, భార‌తీయులంద‌రికీ 18 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సినేష‌న్ చేయాలంటే రూ.67,193 కోట్లు ఖ‌ర్చు కావ‌చ్చున‌‌ని ఓ అధ్య‌య‌నం తేల్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇందులో రూ.46,323 కోట్లు భ‌రించ‌గ‌ల‌వ‌ని తేలింది. కేంద్రం త‌న వాటాగా రూ.20,870 కోట్లు భ‌రించొచ్చు. ఇది దేశ జీడీపీలో కేవ‌లం 0.36 శాత‌మేన‌ని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్‌-రా) అనే సంస్థ గురువారం వెల్ల‌డించిన నివేదిక పేర్కొంది.

కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం 133.26 కోట్ల మంది జ‌నాభాలో 84.19 కోట్ల మంది వ్యాక్సినేష‌న్‌కు అర్హులు. కేంద్రం వ్యాక్సిన్ల ధ‌ర‌లు, సేక‌ర‌ణ‌, వ్యాక్సినేష‌న్ నిర్వ‌హ‌ణ మ‌రింత సౌల‌భ్య‌కరంగా మార్చాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు, 45 ఏండ్లు దాటిన వారికి ఉచిత వ్యాక్సినేష‌న్ అని కేంద్రం తెలిపింది.రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అద‌నంగా అవ‌స‌ర‌మైతే నేరుగా ఫార్మా సంస్థ‌ల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమ‌తించింది కూడా.

అంతేకాదు, భార‌త వ్యాక్సిన్ల త‌యారీదారులు 50 శాతం ఉత్ప‌త్తి చేసిన వ్యాక్సిన్ల‌ను కేంద్రానికి, మిగ‌తా 50 శాతం వ్యాక్సిన్ల‌ను రాష్ట్రాలు, ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు అమ్ముకోవ‌డానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 21.4 కోట్ల వ్యాక్సిన్ల‌ను సేక‌రించ‌డానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ల‌కు కేంద్రం రూ.5,090 కోట్లు చెల్లించింది.

రెండు డోస్‌ల వ్యాక్సిన్‌కు రూ.400గా ప‌రిగ‌ణించారు. దీని ప్ర‌కారం 84.19 కోట్ల మందికి డ‌బుల్ డోస్ వ్యాక్సినేష‌న్ కోసం (155.4 కోట్ల డోస్‌లు) రూ.62.103 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది.ఇప్ప‌టికే ప‌లు కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భారం తగ్గనున్నది.

కేరళ, ఛత్తీస్ గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామని హామీ ఇచ్చాయి. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో బీహార్ రాష్ట్ర స్థూల అభివ్రుద్ధిలో 0.60 శాతం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 0.47 శాతం, జార్ఖండ్ రాష్ట్రంలో 0.37 శాతం ఖర్చు మాత్రమే అవుతుందని అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

క‌రోనా కేసుల్లో వ‌ర‌ల్డ్ రికార్డు..

18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

డోంట్‌ వర్రీ..ఆన్‌ లైన్లో ఆక్సిజన్‌ మిషన్లు

అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

ర‌ష్యా తురుపుముక్క లెనిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

హాస్పిటల్‌ నుంచి 1,710 కొవిడ్‌ వ్యాక్సిన్లు మాయం

వ‌ణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్‌.. ఎందుకంత డేంజ‌ర్‌? ఏం చేయాలి?

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..

నెగెటివ్‌ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్‌కే

‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది

దేశంలో ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌


కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!

అస‌లు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజ‌న్‌, వ్యాక్సినేష‌న్‌పై కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

వ్యాక్సిన్ విధానాన్ని త‌ప్పుప‌ట్టిన సోనియా గాంధీ

తులం బంగారం 4 నెల‌ల్లో రూ.50వేలకు.. ప‌రిస్థితి విష‌మిస్తే.. మరింత పైపైకి!

సొంతింటి కోసం అక‌స్మాత్‌గా పెరిగిన డిమాండ్‌!

Advertisement
అందరికీ వ్యాక్సినేషన్‌కు ఎంతంటే..!?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement