శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 21, 2021 , 01:28:32

బీవోబీ సేవలను వినియోగించుకోండి

బీవోబీ సేవలను వినియోగించుకోండి

  • బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య

 బీబీనగర్‌, జనవరి 20: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కార్పొరేట్‌ బ్యాంకు సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సేవలను ఆయా ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఎయిమ్స్‌ ఆవరణలో  బీవోబీ శాఖను ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియాతో కలిసి  ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ శాఖను ఏర్పాటు చేయడంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా కృషి మరువలేనిదని, కార్పొరేట్‌ స్థాయిలో ఉన్న  బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు విస్తరించి సేవలను అందించడంలో సంతృప్తికరంగా ఉందని అన్నారు. అనంతరం ఆయన అంబులెన్స్‌ను ఎయిమ్స్‌ యాజమాన్యానికి అందించారు. 

VIDEOS

logo