న్యూఢిల్లీ: యూస్డ్ కార్ల స్టార్టప్ కార్స్24లో జపాన్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, డీఎస్టీ గ్లోబల్ 350 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయని సమాచారం. ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్ సైతం కార్స్ 24లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది.
దీంతో కార్స్ 24 మార్కెట్ క్యాపిటలైజేషన్ 200 కోట్ల డాలర్లకు చేరువలో ఉన్నట్లు వినికిడి. అయితే, ఈ విషయమై స్పందించడానికి కార్స్ 24, సాఫ్ట్ బ్యాంక్ స్పందించడానికి నిరాకరించాయి.
కార్స్ 24లో సాఫ్ట్ బ్యాంక్, జీఎస్టీ గ్లోబల్ తదితర సంస్థల పెట్టుబడులపై తదుపరి చర్చలు త్వరలో ముగుస్తాయని తెలుస్తున్నది. వచ్చే 18-24 నెలల్లో ఐపీవోకు వెళ్లడానికి కార్స్ 24 ప్రయత్నిస్తున్నది.
కరోనా నేపథ్యంలో ప్రజా రవాణాకు దూరంగా ఉండేందుకు ప్రజానీకం యూస్డ్ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కొత్త కారు కొనడానికి బదులు యూస్డ్ కార్లు కొనుగోలు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో పెట్టుబడులు సమీకరించడానికి కార్స్ 24 స్టార్టప్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రాధాన్యం ఏర్పడింది.