బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Sep 23, 2020 , 10:24:54

రిల‌య‌న్స్ రిటేల్‌లో కేకేఆర్ సంస్థ‌ రూ.5550 కోట్ల పెట్టుబ‌డి

రిల‌య‌న్స్ రిటేల్‌లో కేకేఆర్ సంస్థ‌ రూ.5550 కోట్ల పెట్టుబ‌డి

హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ సంస్థ‌లోకి పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతున్న‌ది. అమెరికాకు చెందిన కేకేఆర్ అండ్ కంపెనీ తాజాగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది.  కేకేఆర్ సంస్థ రిల‌య‌న్స్‌లో సుమారు రూ.5550 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ది. గ‌తంలో కేకేఆర్ సంస్థ జియోలో 11367 కోట్లు పెట్టుబడి పెట్టింది. తాజా పెట్టుబ‌డితో రిల‌య‌న్స్‌లో సుమారు 1.28 శాతం వాటాను కేకేఆర్ సొంతం చేసుకోనున్న‌ది. రిల‌య‌న్స్ రిటేల్ సంస్థ‌కు ఇటీవ‌ల కాలంలో ఇది రెండ‌వ అతిపెద్డ డీల్ కావ‌డం విశేషం. ఈ పెట్టుబ‌డితో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ సంస్థ విలువ 4.21 ల‌క్ష‌ల కోట్లు చేరుకున్న‌ది.  రిల‌య‌న్స్ రిటేల్‌లో సుమారు 7500 కోట్లు పెట్ట‌బ‌డి పెట్ట‌నున్న‌ట్లు ఇటీవ‌ల సిల్వ‌ర్ లేక్ పార్ట్న‌ర్స్ పేర్కొన్న విష‌యం తెలిసిందే.  అమెజాన్ ఇండియా, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ను ఢీకొట్టేందుకు రిల‌య‌న్స్ భారీ స్థాయిలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్న‌ది. రిల‌య‌న్స్ రిటేల్ వెంచ‌ర్స్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు కేకేఆర్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు రిల‌య‌న్స్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ ముఖేల్ అంబానీ తెలిపారు. logo