ఆదివారం 25 అక్టోబర్ 2020
Business - Sep 22, 2020 , 02:45:00

భారత్‌కు రానున్న టెస్లా

భారత్‌కు రానున్న టెస్లా

బెంగళూరులో ఆర్‌అండ్‌డీ కేంద్రం

బెంగళూరు: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచ ఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. బెంగళూరులో తమ ఆర్‌అండ్‌డీ (పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది. అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేయనున్న తొలి ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఇదే. ఇందుకు సంబంధించిన తొలి ప్రతిపాదనపై ఇప్పటికే రెండు దఫాల చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ నెలాఖర్లో మరో దఫా చర్చలు జరిగే అవకాశాలున్నట్టు కర్ణాటక పరిశమ్రల శాఖ అధికారి తెలిపారని ‘ఎకనమిక్‌ టైమ్స్‌' పత్రిక సోమవారం వెల్లడించింది.


logo