శుక్రవారం 07 ఆగస్టు 2020
Business - Jul 05, 2020 , 01:52:18

మార్కెట్‌లోకి నయా కార్లు

మార్కెట్‌లోకి నయా కార్లు

లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలపాటు ఉత్పత్తికి, అమ్మకాలకూ దూరమైన దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ.. మే నెలాఖర్లో అంతంతమాత్రపు విక్రయాలతో సరిపెట్టుకున్నది. గత నెలే తిరిగి ఉత్పత్తిని ఆరంభించిన సంస్థలు.. ఈ నెలలో మార్కెట్‌లోకి కొత్త మోడల్స్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మారుతీ, హ్యుందాయ్‌, హోండా, ఎంజీ మోటర్‌ సంస్థలు నాలుగు నూతన కార్లను తీసుకొస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కార్లను తమ కస్టమర్ల ముందుకు తెస్తున్నాయి. 

ఈ నెలలో వస్తున్న  నాలుగు మోడల్స్‌

మారుతి ఎస్‌-క్రాస్‌ పెట్రోల్‌

మారుతి సుజుకీ తమ ఎస్‌-క్రాస్‌ కారును సరికొత్తగా పెట్రోల్‌ వెర్షన్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. బీఎస్‌6 1.5 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది రాబోతున్నది. ఏ 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, ఫోర్‌ స్పీడ్‌ టర్క్యూ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌లను ఎస్‌-క్రాస్‌ కోసం మారుతి తొలిసారిగా వినియోగిస్తున్నది.

టక్సన్‌ ఫేస్‌లిఫ్ట్‌


ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టక్సన్‌ అప్‌డేట్‌ మోడల్‌ను హ్యుందాయ్‌ మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నది. బయట చూడ్డానికి పెద్దగా మార్పులు కనిపించకపోయినా.. లోలోపల మాత్రం భారీ మార్పుచేర్పులతో వస్తున్నది. మిడ్‌-లైఫ్‌ ఫేస్‌లిఫ్ట్‌తో దీన్ని తెస్తున్నారు. 2.0 లీటర్‌ టర్బో డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్ల సామర్థ్యంతో రానున్న ఈ కారులో సరికొత్త టచ్‌స్క్రీన్‌తో కొత్త డ్యాష్‌ బోర్డును పెట్టారు.

కొత్త తరం హోండా సిటీగత నెల కొత్త అవతారంలో తమ పాపులర్‌ మోడల్‌ ‘సిటీ’ని హోండా కార్స్‌ ఆవిష్కరించిన సంగతి విదితమే. అయితే దానికి అప్‌డేట్‌ మోడల్‌ను ఈ నెలలో తీసుకురానున్నది. ప్రస్తుత మోడల్‌తో పోల్చితే రాబోయే మోడల్‌ బహీర్గతంగా, అంతర్గతంగా మరిన్ని హంగులతో కనిపించనున్నది. 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌లు దీని సొంతం.

ఎంజీ హెక్టార్‌ ప్లస్‌


ఎంజీ మోటర్‌ ‘హెక్టార్‌ ప్లస్‌' కారును ఎట్టకేలకు దేశీయ మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది. ఎప్పట్నుంచో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని చూస్తున్న సంస్థ.. ఈ నెలలో అందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నది. ప్రస్తుత హెక్టార్‌తో పోల్చితే చూడ్డానికి కొన్ని మార్పులు కనిపిస్తాయి. బంపర్లు, హెడ్‌ల్యాంప్స్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, రేడియేటర్‌ గ్రిల్‌ను ఆధునికీకరించారు. 2.0 లీటర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్లతో లభిస్తుంది.


logo